18, జూన్ 2015, గురువారం

మన తెలుగు కార్టూనిస్టులు

శ్రీ అన్నం శ్రీధర్ బాచి(కార్టూనిస్టు)
వారు సిరి(శ్రీ)ధరులే కాదు... సిరి దరహాసాల రారాజు... చిరునవ్వుల చిరునామాతో, అలుపెరుగని హాస్యచివురులను అణువణువునా చిగురింపజేసే... నవ్వుల సజీవవృక్షమాయన.! వెలితి నిండిన జీవన గమనంలో... హాస్యపు జలధార తానై నిరంతరం ప్రవహించే ఓ నవ్వుల సెలయేరు! తను ఉన్నచోట... నిశ్శబ్ధం పులకింతలతో గిలిగింతలు పెడుతుంది! అయన సమక్షంలో వేసవి సైతం చల్లగాలుల పరిమళాలనందిస్తుంది! ఆయనెవరో కాదు.... ప్రముఖ కార్టూనిస్టు, బాపురమణల కార్టూన్ పురస్కార గ్రహీత... మన సిరిమల్లె పువ్వల్లె నవ్వుఅడ్మిన్ శ్రీ అన్నం శ్రీధర్ గారు!"బాచి" అని పిలవబడే తన మాతృమూర్తి భాగ్యలక్ష్మి గారి నిక్ నేమ్ ని తన కలంపేరుగా మార్చుకుని గత 34 ఏళ్ళుగా వివిధ రకాల కార్టూన్లు గీస్తూ... పాఠకలోకానికి ఎంతో దగ్గరయ్యారు.
వీరి కార్టూన్లు అన్ని తెలుగు దిన, వార, పక్ష మరియు మాస పత్రికలలో ప్రచురితమయ్యాయి. అవే కాక, ప్రముఖ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ పత్రికలలో కూడా అనేక కార్టూన్లు ప్రచురింపబడ్డాయి. ఆంధ్రభూమి డైలీ లో రెండున్నర సంవత్సరాలకు పైగా ప్రచురితమైన స్ట్రిప్ కార్టూన్లు రాధా-రాంబాబువారి వ్యంగ్యరచనా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఎన్నో ప్రదర్శనల్లో చోటు చేసుకున్న వీరి కార్టూన్లు వివిధ పత్రికలు నిర్వహించిన పలు పోటీలలో చాలా బహుమతులు గెలుచుకున్నాయి. కార్టూన్ రంగంలోనే కాదు, రచనావ్యాసాంగంలో కూడా వారిదైన ప్రత్యేకతను చాటుతూ చిన్న కథలు, కవితలు, జోకులు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఎందరినో తన అభిమానులుగా మార్చుకున్న మన బాచి గారి అభిమాన కార్టూనిస్టు ది గ్రేట్ అమెరికన్ కార్టూనిస్ట్ SERGIO ARAGONES అయినప్పటికి తనకు కార్టూనింగ్ లో ఓనమాలు దిద్దించిన స్వర్గీయ శ్రీ కాటూరి కృష్ణమూర్తిగారిని ఆయన ఎప్పటికీ మరచిపోరు. వారిలోని కార్టూనిస్టుకు జీవమిచ్చి, పెంచింది కాటూరి గారైతే, కార్టూన్స్ గీయడంలో నడకలు నేర్పింది, అప్పుడప్పుడూ జారి క్రింద పడిపోకుండా పట్టి నడిపించింది శ్రీ జయదేవ్ గారు, M.S.రామకృష్ణ(ఆయనేదో నా మీద ప్రేమకొద్దికీ అలా అంటుంటారు!), శ్రీయుతులు సుభాని, NSK ప్రసాద్, సరసి, VR ప్రసాద్, కామేశ్ గార్లు... అంటూ చెప్పుకునే మన బాచి... మా కార్టూనిస్టులకెంతో ఆత్మీయుడు.


శ్రీబాచి గుంటూరు జిల్లా స్టూవర్టుపురం S.A.High Schoolలో SSC పూర్తి చేసి, తరువాత చీరాల VRS&YRN Collegeలో 1982లో B.Com పట్టా పుచ్చుకొని, తదనంతరం, Sir Kattamanchi RamalingaReddy Law College, Eluruలో "Law" చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. చీరాల సివిల్ కోర్టు లో 1987 నుండి 1989వరకు ప్రాక్టీసు చేసారు. 1989 లో వ్యక్తిగత స్వాతంత్ర్యం కోల్పోయాక (ఐమీన్‌... పెళ్ళయ్యాక) వారి ప్రాక్టీసు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి మార్చడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు High Courtలోనే ప్రాక్టీస్ కొనసాగిస్తూ తన ఊపిరి అయిన కార్టూన్లు గీస్తూ అందరికీ నవ్వులు పంచుతున్నారు. న్యాయవాదిగా ఆయన గీసిన "కోర్టూనులు" ప్రతిరోజూ హైకోర్టు నోటీస్ బోర్డ్‌ నందు ప్రదర్శించబడేవి. అందుకు గాను, 2009-2010 సం.లో ఆనాటి Honorable Chief Justice Sri Madan B Lokur గారి చేతుల మీదుగా అమూల్యమైన అవార్డును అందుకున్నారు.


వారికి కార్టూన్ రంగంతో పాటు నాటకరంగంపై మక్కువ ఎక్కువ. నటనపై తనకున్న అభిమానంతో... నటనలో తనదైన ప్రత్యేక అభినివేశంతో స్టేజి మీద వివిధ నాటకాలలో వైవిధ్యమైన పాత్రలను ధరించి ప్రేక్షకుల మన్ననలను పొందారు. అందులో ప్రాముఖ్యం సహజంగా హాస్య నాటికలదే! నాటక రంగంలో వారిని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది బుల్లితెర నటులు TV మిస్సమ్మ ఫేమ్ శ్రీ రాజులపాటి ప్రేమసాగర్ గారు. 2009 లో జరిగిన నంది నాటకపోటీలలో వీరు నటించిన "బొమ్మలు చెప్పిన భజగోవిందం" సాంఘిక నాటకానికి రాష్ట్ర ప్రభుత్వం 'బంగారు నంది' బహూకరించింది. తన నటజీవితంలో ఇది ఎప్పటికీ మరువలేని ఒక అరుదైన పురస్కారం గా భావించే మన బాచి గారు స్త్రీ పాత్ర పోషణ లో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. స్త్రీ పాత్రలు పోషించడంలో మేటి శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తనకు ఆదర్శం అంటారు. అలాగే కొన్ని టి.వి. సీరియళ్ళలో, నాలుగైదు సినిమాలలో వీరు నటించడం జరిగింది.

వృత్తిరీత్యా అడ్వకేట్ గా, ప్రవృత్తిరీత్యా వేదికపై నటుడిగా, పత్రికారంగంలో కార్టూనిస్టుగా తాను అంచెలంచెలుగా ఎదగడానికి తన పట్టుదలతో పాటు, వారి కుటుంబసభ్యులు... సహధర్మచారిణి శ్రీమతి శాంతిప్రియ, చిరంజీవులు భాగ్యమాధురి, హరిసాయిసందీప్ ల సహకారం ఎంతో ఉందని చేప్పే మన బాచి గారు ముందు ముందు ముందు మరెన్నో పురస్కారాలు అందుకుంటూ అందరి ఆశిస్సులను, మన్ననలను పొందాలని కోరుకుంటున్నాను. ఈ సిరిమల్లెల వేదికపై అందరు కార్టూనిస్టులను పరిచయం చేసే మన అన్నం శ్రీధర్ బాచి గారిని నేను పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వారం కార్టూనిస్టుగా తన వైవిద్యభరితమైన కార్టూన్లతో పాఠకులందరి మనసుల్లో వేనవేల నవ్వులపువ్వులు పూయిస్తారనే గ్యారంటీ నాది!! 
స్వాగతం... శ్రీ అన్నం శ్రీధర్ (బాచి) గారు... సుస్వాగతం.........!!
-ఎమ్మెస్ రామకృష్ణ ( కార్టూనిస్టు)  

16, జూన్ 2015, మంగళవారం

నవ్య పత్రికలో నా ఇంటర్వ్యూ...

My interview in Navya Weekly(27.5.2015)

PAGE NO. 1





PAGE NO. 2











*గో తెలుగు. కామ్ వారి తిక్క క్వశ్చన్లు – తొక్క ఆన్సర్లు శీర్షికలో... నాకు సంధించిన ప్రశ్నాభాణాలకు... నా జవాబులు
-బాచి
*అన్నీ అబద్ధాలే చెప్తానని పక్కింటి గీత మీద ప్రమాణం చేస్తారా?









*మీ కార్టూన్ల వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారు?


*అన్నం శ్రీధర్ బాచి గారు మీరేనని అందరూ అనుకొంటున్నారట?


*కొన్ని నమస్కారాలున్నాయి...కొంటారా?



*మీ కార్టూన్లతో ఏమేం చెయ్యొచ్చు?



*ఇంకెందుకు వాదిస్తున్నారు?



*ఎండలు మండిపోతున్నాయి కాస్త మీ కార్టూన్లతో తగ్గించొచ్చు కదా?



*మీలో ఎవరెవరున్నారు?



*ఎందుకు కొత్త సంగతులు చెప్తున్నారు?



*ఇంకా ఎన్ని కార్టూన్లు గీయకుండా వదిలేసారు?




*ముప్పయ్యేళ్ళుగా కార్టూన్లు గీస్తున్నారు కదా, ఎన్నేళ్ళుగా కార్టూన్లు గీస్తున్నారు?




*మన పురాణాలలో మీ కార్టూన్ల ప్రసక్తి ఎక్కడ వచ్చిందో చెప్పగలరా?



*లాలూ ప్రసాద్ యాదవ్ దాణా స్కాం మరుగున పడి చాలారోజులయింది కదా, ఇంకా మీరెందుకు భయపడుతున్నారు?




*మీరు చాలా అజాగ్రత్తగా కార్టూన్లు గీస్తారట?



*నవీన్ పట్నాయక్, అమితాభ్ బచ్చన్, అరవింద్ కేజ్రివాల్, మాధురీ దీక్షిత్, వీళ్ళందరిలో ఎవరైనా మిమ్మల్ని కార్టూన్స్ గీయమనై బెదిరించారా?



*మీరేం మర్చిపోయారో మీకైనా గుర్తుందా?



*మీ కార్టూన్లపై మీ అభిప్రాయం?


 
*ఆన్సర్లు అయిపోయాయేమో మీ బ్యాగులో చూసి చెప్తారా?
వ్యాఖ్యను జోడించు




7, ఏప్రిల్ 2014, సోమవారం

నా గురించి రేడియో తరంగ లో ... http://telugu.tharangamedia.com/aahvanam-with-sridharbachi14th-march-2014/

( ఈ  లింక్ తెరవండి )
























http://telugu.tharangamedia.com/aahvanam-with-sridharbachi14th-march-2014/

1, డిసెంబర్ 2013, ఆదివారం

64 కళలు - మన కార్టూనిస్టులు లో నా గురించి.... 

 *ముఖచిత్రం *




 
*మొదటి పేజి*

*మూడవ పేజి *







6, ఆగస్టు 2013, మంగళవారం

21, జులై 2013, ఆదివారం

నా మధుర స్మృతులు

బాపు బొమ్మల కొలువు పుస్తకావిష్కరణ


  

 

 

 

 

 

 నా ఆఫీసులో కార్టూనిస్ట్ మిత్రులతో ఆప్యాయ కలయిక  ... 



బాపు బొమ్మల కొలువు సమయంలో... 

 మేరియో మిరండా గారికి నివాళులర్పిస్తూ



 సమైఖ్యభారతి కార్టూన్ ఎగ్జిబిషన్ 







హై కోర్టు  వార్షికోత్సవంలో సెక్రటరీ గా జడ్జీలను ఆహ్వానిస్తూ 




ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ అడ్వకేట్  అసోసియేషన్ సెక్రటరీ గా వార్షిక రిపోర్ట్ చదువుతూ 



 ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ న్యాయవాదుల అధ్యక్షులు శ్రీ  ఏ. సుదర్శన్ రెడ్డి గారితో




ఏక్టింగ్ చీఫ్ జస్టిస్ శ్రీ గులాం అహ్మద్ గారి నుండి షీల్డ్ అందుకుంటూ... 



బాపూ బొమ్మలకొలువు  లో తోటి కార్టూనిస్ట్ లతో...