కోర్టూనులు (Courtoons)

కోర్టూనులు... (Courtoons) 



  • ఎందుకైనా మంచిదని నా కేసు వివరాలు మీ అబ్బాయికి కూడా చెపుతున్నా.ఎందుకంటే, నా అప్పీల్ ఫైనల్ హియరింగ్ కి వచ్చేనాటికి, ఈ  కేసు మీ అబ్బాయి చేయవలసి ఉంటుదేమోనని... !




  • సరుకులు కొనడానికి డబ్బులు అడిగితే, కౌంటర్ ఫైల్ చేయడానికి టైం అడుగుతున్నారు ఒదినా ...!




  • బాధపడకు తాతయ్య... మన ఫ్యామిలీ కేస్ త్వరలొనే అయిపోతుందిలే... నా మనవడు ఈ  మధ్యనే ఆ కేసు ఇంప్లీడ్  అయ్యాడు లే...



  • చూడమ్మా నీకు జరుగుతున్న గృహహింస గురించి ఇంత వివరంగా చెప్పనక్కరలేదు...



  • నేనిచ్చే ఈ ఫీజు చాలకపోతే, మిగిలినవి కలర్ జిరాక్స్ తీసుకోండి.
  • నీకెన్నిసార్లు చెప్పాలి సార్... మా ప్రొఫెషనల్  సీక్రేట్స్ అడగొద్దని...!

  • నాన్న... ఫస్ట్ అప్పీల్ లోనే క్లయింట్ దగ్గిర పూర్తి ఫీజు  వసూళు  చెయ్యొద్దని ... నేను ప్రొఫెషన్  లోకి వచ్చేసరికి  నాకేమి   మిగులుతుంది ...?



  • కంగ్రాట్స్ రావు గారూ డైవోర్స్ తీసుకుంటున్నారు. దానికి కూడా చాలా ధైర్యం ఉండాలి.



  • లేదు లేదు జడ్జి గారూ... కోర్టుకి ఎండాకాలం సెలవులు కదా... నా కేసులో House Motion అడగటానికి వచ్చాను.



  • దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెపుతాను.  ఈ కేసులో తప్ప...



  • నిజమే రావు గారూ... కొన్ని సార్లు ఆర్డర్స్ అమలు పరచడం కంటే, ఉల్లంఘించడమే చాలా బాధాకరంగా ఉంటుంది.


  • సార్  నా కేసులో మీరు నన్ను ఫీజు అడుగుతారంటే అస్సలు నమ్మశక్యంగా లేదు...




  • ఏకలింగం లాయరు గారికి జూనియర్స్ లేరు కదా సార్ ... వాయిదా అడగటానికి పావురాన్ని పంపించాడు




  • ఎట్టకేలకు నాకు గవర్నమెంటు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ కేసులో విజయం సాధించాను. కాని, ఆ ల్యాండ్ మొత్తం మా ఫ్లీడరుగారి ఫీజు క్రింద అసైన్డ్ చేయవలసి వచ్చింది.





  • పెట్రోల్ ధర, ట్రాఫిక్ జామ్ తట్టుకోవడానికి ఈ పద్ధతి కనిపెట్టాడు గుర్నాధం గారు





  • దొంగతనం మానేయమని మీరు యిచ్చిన  సలహా బాగానే ఉంది సార్ ... కానీ మేం మానేస్తే, మీరు కేసుల్లేక ఫ్రొఫెషన్ మానేయవలసి వస్తుంది...





  • మా ఇంట్లో  గృహ హింసకు తావే లేదు రాణి... మా నాన్న నగరంలో గొప్ప క్రిమినల్ లాయర్...




  • దేవుని ఎదుట  ప్రమాణం చేసి అంతా నిజమే చెపుతాను గీతా... నేను నిన్ను ప్రేమిస్తున్నాను.


  • ఈ కేసు వాయిదా వేయడానికి మీరు చెప్పిన కారణం చాలా బాగుందండి... ఇదే కధ రాంగోపాల్ వర్మకు చెబితే, మంచి సినిమా తీస్తాడు కదా...???


  • మా టీచరు ఒక్కసారి ఇంపోజిషన్ రాయమంటే ఇదై పోతున్నారు... ప్రతిరోజు మీ కేసుల్లో కూడా మీ జడ్జి గారు బెటర్ అఫిడవిట్స్ వేయమంటే వేయడంలే...!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి